: శ్రీశైలం ట్రస్టు బోర్డులో చెంచులకు స్థానం కల్పిస్తాం: మంత్రి ఏరాసు


రాష్ట్రంలో చెంచుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటామని న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో, వారికి ఉద్యోగాలతో పాటు శ్రీశైలం ట్రస్టు బోర్డులోనూ స్థానం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఈ రోజు నుంచి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా చెంచు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.

ఈ ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం మంత్రి ఏరాసు మాట్లాడుతూ, చెంచుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ సుదర్శన్ కూడా ఉన్నారు. 

  • Loading...

More Telugu News