: చంద్రబాబు బస్సులో పొగలు


తెలుగువారి ఆత్మగౌరవం పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బస్సుయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఉదయం ఆయన కృష్ణాజిల్లా నూజివీడు నుంచి యాత్ర ఆరంభించాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణిస్తున్న బస్సులో స్వల్పంగా పొగలు వచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది పొగలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం యాత్ర యథావిధిగానే జరిగింది. నేటికి కృష్ణాజిల్లాలో మూడో రోజు యాత్ర చేస్తున్న బాబు నూజివీడు, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

  • Loading...

More Telugu News