: ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున... భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు పోలీసులు. పది రోజుల పాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రకటించారు. ఈ ఆంక్షలు ఈ నెల 9 నుంచి 19 వరకు అమల్లో ఉంటాయని ఆయన చెప్పారు. పంజాగుట్ట, ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు రైల్వే గేటు గుండా కాకుండా నిరంకారి భవన్ మీదుగా వెళ్లాలని తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు ఐమాక్స్ మీదుగా వెళ్లాలని కమిషనర్ చెప్పారు. రాజ్ దూత్ హోటల్, ఖైరతాబాద్ కూరగాయల మార్కెట్, సీబీఐ క్వార్టర్స్ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వెళ్లే వాహనాలు మున్సిపల్ వార్డు ఆఫీసు మీదుగా వెళ్లాలని తెలిపారు. అంతే కాకుండా నగరంలోని విగ్రహ మండపాల దగ్గర బాణాసంచా కాల్చడం కూడా నిషేధమని అన్నారు.