: యూఎస్ ఓపెన్ లో మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్స్ నేడే
యూఎస్ ఓపెన్ చివరి అంకానికి చేరుకుంది. మహిళల ఫైనల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ లు నేడు జరగనున్నాయి. మహిళల సింగిల్స్ లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకాతో తలపడనుంది. పురుషుల డబుల్స్ లో భారత ఆటగాడు లియాండర్ పేస్, రదెక్ స్టెపానక్ జోడీ.... బ్రూనో సోరెన్, అలెగ్జాండర్ పేయా జంటను ఎదుర్కోనుంది.
పురుషుల డబుల్స్ మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. మహిళల సింగిల్స్ మ్యాచ్ అర్ధరాత్రి తర్వాత ప్రారంభమవుతుంది.
సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో... నాదల్ తో జకోవిచ్ తలపడనున్నాడు. శనివారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో వావ్రింకాపై జకోవిచ్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు.