: పూరీలో భవనం నేలమట్టం.. నలుగురి మృతి
అధికారుల అవినీతి, చూసీ చూడనట్లు వదిలేసే తీరుతో పట్టణాలలో పురాతన భవనాలు కుప్పకూలుతూనే ఉన్నాయి. గత రెండు నెలల కాలంలో హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఇలాంటి ప్రమాదాలే జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. తాజాగా ఒడిశాలో ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం పూరీలో ఈ తెల్లవారుజామున రెండంతస్తుల భవనం నేలమట్టమైంది. దీంతో నలుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ భవనం వందేళ్ల నాటిదని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.