: వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కూడా ఆవరించి ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.