: భారత్ కు ఆడతానని కలలో కూడా అనుకోలేదు: ధోనీ
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదేనేమో! అందరూ చెన్నై టెస్టులో ధోనీ విధ్వంసక డబుల్ సెంచరీ గురించి మాట్లాడుతుంటే.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని కలలో కూడా ఊహించలేదని ఈ భారత కెప్టెన్ అంటున్నాడు. ఎప్పుడూ భేషజాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని ధోనీ చెప్పాడు.
జట్టు విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నానని ధోనీ అన్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. తొలి ఇన్నింగ్స్ లో భారీ షాట్లు ఆడడం ద్వారా ఆసీస్ ఫీల్డింగ్ లో ఖాళీలు సృష్టించగలిగానని చెప్పుకొచ్చాడీ వికెట్ కీపింగ్ కెప్టెన్.