: తిరిగి వెళ్తున్న ఏపీఎన్జీవోల బస్సులపై రాళ్ళ దాడి


సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ముగించుకుని తిరిగి వెళ్తున్న ఏపీఎన్జీవోల బస్సులపై మలక్ పేట, అబ్దుల్లాపూర్ మెట్, చాదర్ ఘాట్ వద్ద రాళ్లదాడి జరిగింది. దుండగులు మొత్తం ఐదు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. పోలిస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికి వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. రాళ్ల దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను ఏపీఎన్జీవోలు పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News