: మిలియన్ మార్చ్ చేస్తాననడం సరికాదు: డీఎస్
ఏపీఎన్జీవోలు హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించడం సరికాదని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఏపీఎన్జీవోల సభలో కానిస్టేబుల్ పై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించి మరోసారి తమ సంప్రదాయాన్ని చాటి చెప్పారని అన్నారు. హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో భాగమేనని, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.