: సీఎన్జీ ధరకు రెక్కలు
సీఎన్జీ (వాహనాలకు పెట్రోలు, డీజిల్ బదులు వాడే గేస్ ఇంధనం) ధర మరోసారి పెరగనుంది. శనివారం అర్థరాత్రి నుంచి కిలో సీఎన్జీకి 3.79 రూపాయలు పెంచాలని చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెంచిన సీఎన్జీ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. గతవారం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.