: ఏపీఎన్జీవోల సభలో సీఎం భాగస్వామ్యం ఉంది: కేకే
నేడు హైదరాబాదులో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని టీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల ఇన్ చార్జి కె.కేశవరావు ఆరోపించారు. సభ నిర్వహణలో ఏపీఎన్జీవోలతో కిరణ్ కు భాగస్వామ్యం ఉందని అన్నారు. ఇక నిజాం కళాశాల హాస్టల్ ఎల్బీ స్టేడియం పక్కనే ఉండడం తప్పా? అని ప్రశ్నించారు. హాస్టల్లోకి చొరబడి మరీ పోలీసులు విద్యార్థులను కొట్టారని కేకే చెప్పుకొచ్చారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.