: కాంగ్రెస్ ను భూస్థాపితం చేయండి: చంద్రబాబు


తెలుగు జాతి విచ్ఛిన్నానికి, విద్వేషాలకు కారణమైన కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్రలో ఆయన మాట్లాడుతూ తెలుగువారికి కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ఎదురొడ్డి మరీ టీడీపీ పోరాడుతోందని అన్నారు. జోరున కురుస్తున్న వర్షంలో కూడా చంద్రబాబు తన యాత్రను కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారాలపై మాట్లాడకుండా కేవలం తెలుగు ప్రజలను ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పూనుకుందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News