: అమెరికా నుంచి రాగానే సోనియా ప్రకటన చేస్తారు: రాయపాటి
సమైక్యాంధ్ర ఉద్యమంతో కేంద్రం రాష్ట్ర విభజనపై పునరాలోచిస్తుందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా నుంచి రాగానే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పారు. కాగా, సమైక్యాంధ్ర సభ విజయవంతమైందని, త్వరలో సికింద్రాబాదులో లక్షమందితో మరో సభ నిర్వహిస్తామని రాయపాటి చెప్పారు.