: సమైక్యంగా ఉన్నా, విభజించినా అందరికీ న్యాయం చేయాలి: జేపీ
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విభజించినా మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం అందించాలని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సూచించారు. విజయవాడలో జరుగుతున్న లోక్ సత్తా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వద్దంటున్నా టీడీపీని ఓడించేందుకు వైఎస్సారే తొలిసారిగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. 2004లో రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం వల్లే ప్రత్యేక రాష్ట్ర అంశం మరింత బలపడిందని జేపీ అన్నారు.