: ఇది రాయ్ బరేలీ బడ్జెట్: బీజేపీ
రైల్వే బడ్జెట్టుపై బీజేపీ పెదవి విరిచింది! ఇది రైల్వే బడ్జెట్ లా లేదనీ, రాయ్ బరేలీ బడ్జెట్ లా ఉందని బీజేపీ నేత గోపీనాథ్ ముండే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 12 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ నేత రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముండే తనదైన శైలిలో చురక వేశారు.
రాయ్ బరేలీ ఉత్తర ప్రదేశ్ లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియోజకవర్గం. అంటే బడ్జెట్ పూర్తిగా కాంగ్రెస్ పక్షంగానే ఉందని చెప్పటానికి ఆయన ఇలా అన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రమే బడ్జెట్ దృ