: దోచుకున్నదెవరు.. మీ వాదనపై మీకే నమ్మకం లేదు:మురళీకృష్ణ


ఎక్కడ? ఎవరు? ఎలా దోచుకున్నారో చెప్పాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగసంఘం నేత మురళీకృష్ణ తెలంగాణ వాదులకు సవాల్ విసిరారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ, అబద్దాలు చెప్పొద్దని, వాస్తవాలతో వాదాలు మొదలు పెట్టాలని సూచించారు. తొలుత తాము మోసపోయామన్నారని, తరువాత తమ ఉద్యోగాల కోసం అన్నారని, ఆ తరువాత తమ ఆత్మగౌరవపోరాటమన్నారని, ఇప్పడు స్వయంపాలన అంటున్నారని.. అంటే 'మీ వాదనలేవీ నిజాలు కాదని మీరే ఒప్పుకున్నారు' అని ఆయన స్పష్టం చేశారు. తామేమీ వరంగల్ నో, అదిలాబాద్ నో, మెదక్ నో అడగడం లేదని గుర్తించాలని సూచించారు.

అలాగే దోచుకున్నారు, దోచుకున్నారు అంటున్నారు కానీ, మీ నేతలే మిమ్మల్ని దోచుకున్నారని, అది గుర్తించాలని కోరారు. విభజనవల్ల భావితరాలన్నీ నష్టపోతాయని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు పెట్టిందెవరు? ఉద్యోగావకాశాలు కల్పించిదెవరు? అని ప్రశ్నించారు. ఎంత మంది తెలంగాణ నాయకులు తెలంగాణలో ఉద్యోగాలు కల్పిస్తున్నారో ఆత్మావలోకనం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News