: భారత రచయిత్రి మృతదేహాన్ని కోల్ కతా తరలించాలి: మమతా


ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటెంట్ల చేతిలో అసువులుబాసిన భారత రచయిత్రి సుస్మితా బెనర్జీ మృతదేహాన్ని ఆమె జన్మస్థలమైన కోల్ కతా తీసుకురావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సహాయం కోరినట్లు తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ తెలిపారు. రెండురోజుల కిందట అనుమానిత మిలిటెంట్ల కాల్పుల్లో బెనర్జీ మరణించారు.

  • Loading...

More Telugu News