: నిర్ణయాలు మార్చుకోకపోతే నిర్ణేతలు మారతారు: గజల్ శ్రీనివాస్


నిర్ణయాలు మార్చుకోవడం సాధ్యం కాదని నేతలు అంటున్నారని, అలా నిర్ణయాలను మార్చుకోకపోతే నిర్ణేతలే మారతారని గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల డబ్బు సంచుల్లోంచి రాలేదని, తెలుగు తల్లి గర్భసంచి నుంచి వచ్చిందని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వృద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులు సైతం సత్యాగ్రహ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News