: ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారులే పరిరక్షించాలి: రఘువీరా


రోజురోజుకు భూముల కబ్జాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులదేనని మంత్రి రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రాంతీయ రెవిన్యూ సదస్సులో మంత్రులు రఘువీరా, గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

సదస్సును ప్రారంభించిన అనంతరం రఘువీరా మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత రెవిన్యూ ఉద్యోగులదేనని పేర్కొన్నారు. కాగా, అధికారుల విధులకు సంబంధించిన పౌరసేవా పత్రాన్ని త్వరలో చట్ట రూపంలో తెస్తామని మంత్రి తెలిపారు.

ఇంకా ఈ సమావేశంలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు, మీ సేవ, రికార్డుల నిర్వహణ, భూ సర్వే, విపత్తు నివారణ యాజమాన్యం వంటి అంశాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News