: నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అబ్దుల్ కరీం తుండా


లష్కరే తోయిబా తీవ్రవాది, బాంబు తయారీ నిపుణుడు అబ్దుల్ కరీం తుండాను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. 1997లో జరిగిన బాంబు పేలుళ్లు, అనధికారికంగా పాకిస్తానీ పౌరులను భారత్ లోకి పంపించడంలాంటి కేసులను విచారించే నిమిత్తం తుండాను పోలీసులకు అప్పగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. 37 బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులో 10 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు తుండాను చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

  • Loading...

More Telugu News