: ఆర్టీసీ ఉనికికే ప్రమాదం: కార్మికనేత ప్రసాద్
రాష్ట్ర విభజన జరిగితే ఆర్టీసీ ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆర్టీసీ కార్మిక సంఘ నేత ప్రసాద్ పేర్కొన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమంలో ప్రధాన పోత్ర పోషిస్తున్న ఆర్టీసీ కార్మికులు 13 జిల్లాల్లో 120 డిపోల వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారని వివరించారు. పదవ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగం కల్పించే సంస్థగా ఆర్టీసీకి ఎంతో గుర్తింపు ఉందని, రాష్ట్ర విభజన జరిగితే దాని మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ప్రసాద్ అన్నారు. రాష్ట్రం ముక్కలైతే హైదరాబాదులోని బస్ భవన్, ఆర్టీసీ ఆసుపత్రి (తార్నాక)తో పాటు మరెన్నెంటినో వదులుకోవాల్సి వస్తుందని వివరించారు.