: తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతోంది: షిండే
తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతోందని కేంద్ర హోంశాఖా మంత్రి షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ కోరిక మేరకు నోట్ తయారు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ పై మూడు ప్రతిపాదనలు ఉన్నాయని, ఏదో ఒక నిర్ణయాన్ని అమలు చేస్తామని అయన తెలిపారు. అయితే విభజనపై అప్పుడే అన్ని విషయాలు చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.