: విభజన వల్ల నష్టపోయేది విద్యార్థులే: కృష్ణయ్య యాదవ్


రాష్ట్ర విభజన వల్ల నష్టపోయేది విద్యార్థులే అని సీమాంధ్ర విద్యార్థి నేత కృష్ణయ్య యాదవ్ వివరించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము ఎక్కడ చదివినా చివరికి హైదరాబాద్ రాక తప్పట్లేదని, హైదరాబాద్ ఎవడబ్బ సొత్తని ఇప్పుడు వదిలిపెట్టాలని ఆయన ప్రశ్నించారు. తమను తరిమేస్తే ఎక్కడికెళ్ళాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ నుంచి సీమాంధ్ర విద్యార్థులను వెళ్ళిపోవాలనడం సంస్కారమనిపించుకోదని హితవు పలికారు. అదే తెలంగాణ విద్యార్థులు ఆంధ్ర ప్రాంత యూనివర్శిటీల కొస్తే ఐదు శాతం రిజర్వేషన్లతో వారిని అక్కున చేర్చుకుని, తమ హాస్టల్ గదుల్లో చోటు కల్పిస్తున్నామన్నారు. కానీ, ఇక్కడ ఓయూలో అలాంటి పరిస్థితి కనిపించడంలేదని విమర్శించారు.

ఇక కేసీఆర్ ఫ్యామిలీపైనా విమర్శలు సంధించారు. ఉద్యమంలో చనిపోయింది విద్యార్థులే కానీ, కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? అని సూటిగా ప్రశ్నించారు. అశోక్ బాబువైపే ప్రజలందరూ చూస్తున్నారని, ఆయన నాయకత్వంలో అందరూ ముందుకెళ్ళాలని ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News