: కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే విభజన ఆగుతుంది: డాక్టర్ మిత్రా
రాష్ట్ర విభజనను ఆపడమన్నది ఉద్యోగులో, ప్రజలో, మరొకరి చేతుల్లోనే లేదని డాక్టర్ మిత్రా అన్నారు. మాజీ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ మిత్రా హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సేవ్ ఆంధప్రదేశ్ సభలో మాట్లాడుతూ.. ఎప్పుడైతే కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారో అప్పుడే రాష్ట్ర విభజన ఆగిపోతుందని గట్టిగా చెప్పారు. అలా చేయలేక, రాష్ట్రానికి రాలేక కేంద్ర మంత్రులు ఢిల్లీలో దొంగల్లా దాక్కున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాలు చేస్తున్న సీమాంధ్ర ప్రజల రక్షణకోసం ఏ మంత్రులు ఆలోచించాల్సిన అవసరం లేదన్న మిత్రా తమ రక్షణకోసం 30 లక్షల మంది ఉన్నారన్నారు. విభజనకు సరే అంటూ ఆనాడు లేఖలు ఇచ్చిన రాజకీయ పార్టీలు తొందరపడి ఇచ్చి ఉంటారని.. ఇప్పుడైనా ఆ లేఖలను వెనక్కు తీసుకుంటే తప్పులేదన్నారు.