: సమ్మెకు శ్రీవారికి ముడిపెట్టిన అశోక్


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ సీరియస్ విషయాలే కాదు చలోక్తులు కూడా విసరగలనని చాటుకున్నారు. సభలో తన ప్రసంగాన్ని ముగిస్తూ, చిన్న జోక్ చెప్పారు. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి తాను రోజుకు మూడు గంటలే నిద్రపోతున్నానని చెప్పారు. అయితే ఇటీవల ఓ రోజు తిరుపతి వెంకన్న కలలోకి వచ్చి.. ''నాయనా, నీవు రోజుకు 3 గంటలన్నా నిద్రపోతున్నావు, నేనైతే గతకొన్నేళ్ళుగా నిద్రకే నోచుకోలేదని, అయితే సమ్మె కారణంగా పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారట. అంతేగాకుండా సమ్మెను కొనసాగిస్తే తాను మరికొంత కాలం ప్రశాంతంగా ఉంటాను' అని తెలిపాడట. ఈ విషయం సభా ముఖంగా అశోక్ వెల్లడించగానే ఉద్యోగుల ముఖాల్లో నవ్వులు పూశాయి.

  • Loading...

More Telugu News