: నేను రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తేలేదు: అశోక్ బాబు
ఇటీవల కొంత కాలం క్రితం వరకు పరుచూరి అశోక్ బాబు అంటే ఎవరికీ తెలియదని, కానీ, రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో అశోక్ బాబు అంటే ఎవరైనా గుర్తిస్తారని చెప్పారీ ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సాక్షిగా తాను ఉద్యోగులతోనే ఉంటానని అశోక్ ఉద్ఘాటించారు. కాగా, విడిపోయిన ఓ మూడు రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ఇక్కడా అదే పరిస్థితి పునరావృతం కావొచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.