: 26/11 లాంటి మరో ఘటనను భారత్ చూడవచ్చు: హఫీజ్ సయీద్
తమ జిహాదీ దాహాన్ని తీర్చుకునేందుకు లష్కరే తోయిబా భారత్ ను హెచ్చరిస్తూనే ఉంది. 26/11 ముంబయి లాంటి ఘటనను భవిష్యత్తులో భారత్ చూడవచ్చని లష్కరే తోయిబా సంస్థాపకుడు హఫీజ్ సయీద్ అంటున్నాడు. కాశ్మీర్ ను పూర్తిగా పాకిస్థాన్ ఆధీనంలోకి తెచ్చుకునేంతవరకు తమ దాడులు కొనసాగుతుంటాయని సూచనలిచ్చాడు. ఇస్లామాబాద్ లో నిన్న(సెప్టెంబర్ 8) పదివేలమంది మద్దతుదారులతో నిర్వహించిన ర్యాలీలో సయీద్ ఈ వ్యాఖ్యలు చేశాడు.