: జమ్ముకాశ్మీర్ లో ముగ్గురు తీవ్రవాదుల హతం
శ్రీనగర్ కు 50 కి.మీ దూరంలో ముగ్గురు తీవ్రవాదులను కాల్చి చంపారు సీఆర్పీఎఫ్ జవాన్లు. వీరి దగ్గర నుంచి ఏకే-47 తుపాకులు, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో కొంతమంది జవాన్లకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. ఈరోజు కాశ్మీర్‌లో ప్రముఖ సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతా కచేరీ జరగనుంది. దీనికి నిరసనగా వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిచ్చారు. కచేరీని అడ్డుకోవడంలో భాగంగానే ఉగ్రవాదులు దాడికి యత్నించి ఉండొచ్చని సమాచారం.