: స్టేడియం వెలుపల మానవహారం
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వేదికగా నిలుస్తున్న హైదరాబాదు ఎల్బీ స్టేడియం వద్దకు భారీగా సమైక్యవాదులు చేరుకున్నారు. తమను కూడా సభకు అనుమతించాలని కోరుతూ వారంతా మానవహారం నిర్వహించారు. మరోవైపు ప్రైవేటు ఉద్యోగులు సైతం స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. ఐటీ ఉద్యోగులు సభకు తమ సంఘీభావం తెలిపారు.