: గళమెత్తిన గజల్ శ్రీనివాస్


ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభా వేదికపై గళమెత్తారు. రోటీన్ కు భిన్నంగా తన గాత్రానికి కాసింత ఆవేశాన్ని జోడించారు. జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి అంటూ ఉద్వేగభరితంగా గానం చేశారు. అంతకుముందు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన పోలీసులు గజల్ శ్రీనివాస్ తో పాటు ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావును కూడా స్టేడియంలోనికి అనుమతించారు.

  • Loading...

More Telugu News