: కాసేపట్లో ప్రారంభం కానున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ మరి కాసేపట్లో ఆరంభం కానుంది. వేలాదిమంది ఏపీఎన్జీవోలు హాజరై సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. స్టేడియం బయట వేలాది మంది సమైక్యవాదులు లోపలికి అనుమతి కోరుతున్నారు. కానీ పోలీసులు వారిని అనుమతించడం లేదు. అయినప్పటికీ వారంతా స్టేడియం వెలుపలే ఉండి సమైక్యవాదానికి మద్దతు తెలుపుతున్నారు. ఎల్బీ స్టేడియం లోపల పలు సంస్కృతిక కార్యక్రమాలతో ఏపీఎన్జీవోలు అందరినీ అలరిస్తున్నారు. సమైక్య సదస్సులో మహిళలు ముందుండి నడవడాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు.