: తెలంగాణ అడ్డుకునేందుకే సభకు అనుమతి: కోదండరాం
సమైక్యవాదానికి బలం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత కోదండరాం తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే ఏపీఎన్జీవోల సభకు అనుమతినిచ్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ పోరాటం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాత్రమేనని ఆయన అన్నారు. అన్నిజిల్లాల్లో జేఏసీ నేతలను ఏకపక్షంగా అరెస్టు చేశారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.