: ఎర్రకోటలాంటి వేదికపై మోడీ చత్తీస్ గఢ్ ఎన్నికల ప్రసంగం
చత్తీస్ గఢ్ ఎన్నికల సందర్భంగా రాయ్ పూర్లో జరుగుతున్న ర్యాలీనుద్దేశించి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి వేదికను ఎర్రకోట ఆకృతిలో ఏర్పాటు చేశారు. తాను ప్రధాని రేసులో లేనని మోడీ ప్రకటించిన రెండు రోజుల్లోనే ఆయన కోసం ఇలాంటి వేదికను ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చను లేవనెత్తింది. మోడీ అంటే ఒంటికాలిపై లేచే డిగ్గీరాజా దీనిపై ఏం కామెంట్లు చేస్తాడో చూడాలని పలువురు పరిశీలకులు అంటున్నారు.