: పోలీసులు ఉద్యోగులను అడ్డుకుంటున్నారు: అశోక్ బాబు
గుర్తింపు కార్డులున్న ఉద్యోగులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియంలో కొన్ని కుర్చీలు ఖాళీగానే ఉన్నా, పోలీసులు ఉద్యోగులను లోపలికి అనుమతించకపోవడం సరైన పద్దతి కాదని అన్నారు. స్టేడియం బయట పెద్ద సంఖ్యలో వేచిచూస్తున్నారని.. ఉద్యోగులతోపాటు కళాకారులనూ లోపలికి అనుమతించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, తెలంగాణ జేఏసీ బంద్ కు పిలుపునివ్వడంతో నగరంలో హోటళ్ళు మూతపడ్డాయని ,దీంతో సభకు హాజరైనవారికి భోజనం పెట్టలేకపోతున్నామని అశోక్ బాబు విచారం వ్యక్తం చేశారు.