: సంఘీభావం తెలిపేందుకు కదిలిన హైదరాబాద్ సమైక్యవాదులు
ఏపీఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉన్న సీమాంధ్రులు కదులుతున్నారు. దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి, చింతల్, నగర శివారుల్లోని పారిశ్రామికవాడల్లో నివాసముంటున్న వేలాది మంది కదలి వస్తున్నారు. వీరంతా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ఆరంభమయ్యే సమయానికి స్టేడియం వద్దకు చేరుకోనున్నారు. ఇప్పటికే ఎల్బీస్టేడియానికి చెందిన అన్ని గేట్ల వద్ద భారీ సంఖ్యలో ఏపీఎన్జీవోలు, సమైక్యవాదులు వేచిచూస్తున్నారు. పలు ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు బయటే ఉండిపోయారు. వీరందరికీ నగరానికి చెందిన సీమాంధ్రులు మద్దతు తెలపనున్నారు.