: భారీగా పెరగనున్న డీజిల్ ధరలు?


అంతర్జాతీయ మార్కెట్లో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో కనీసం రెండు నెలలకోసారైనా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలతో ప్రజలపై భారాన్ని మోపుతున్న ప్రభుత్వం త్వరలో డీజిల్ ధరలను భారీగా పెంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలతో వచ్చేనెల నుంచి ఇంధనాల (డీజిల్, పెట్రోల్, కిరోసిన్) వినియోగాన్ని అదుపు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రూపాయికి మద్దతు తెలపడం, రవాణా బిల్లును తగ్గించుకునేందుకే ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారట. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారు కాగా.. తాజాగా రూ.3 నుంచి రూ.5 మేర డీజిల్ ధర పెంచాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి పతనంతో భారత్ మే 1నాటికి 50 శాతం ఆయిల్ భారాన్ని భరించింది. దాంతో, తక్షణమే చర్యలు చేపట్టాలని యోచించిన సర్కార్ ఇంధన వినియోగాన్ని కూడా అంతే భారీగా అదుపు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News