: కోల్ కతా హాస్పిటల్ లో 31 మంది చిన్నారుల దుర్మరణం
కోల్ కతాలోని బీసీ రాయ్ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రి శిశుమరణాలతో అట్టుడుకుతోంది. గత నాలుగు రోజుల్లోనే ఇక్కడ 31 మంది చిన్నారులు చనిపోయారు. ఈ నెలలో ఇక్కడ చనిపోయిన చిన్నారుల సంఖ్య అక్షరాలా 250 అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వాతావరణం తల్లిదండ్రుల రోదనలతో దయనీయంగా మారింది. ఈ ఘోరకలికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ చనిపోయిన చిన్నారుల చావుకు డాక్టర్లు, నర్సులు కారణం కాదని.. పరిస్థితి విషమించిన తర్వాత పిల్లలను తీసుకుని రావడమే కారణమని టాస్క్ ఫోర్స్ చైర్మన్ చెప్పడం కొసమెరుపు.