: ప్రజల ఆకాంక్ష మన్నించని పార్టీలకు శుభం కార్డే: అశోక్ బాబు
సీమాంధ్రలో ప్రజలందరూ సమైక్యాంధ్రనే కాంక్షిస్తున్నారని, వారి అభిప్రాయాలను గౌరవించని పార్టీలకు శుభం కార్డు తప్పదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం పోరాడే పార్టీలకు భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ఇక, రాష్ట్ర విభజన ప్రకటనపై కేంద్రం వెనక్కి మళ్ళేవరకు సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేటి సభను అడ్డుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.