: అలరించిన మహిళా ఉద్యోగిని మిమిక్రీ
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఏపీఎన్జీవోలు అన్నీ తామై ఆకట్టుకుంటున్నారు. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా సభకు హాజరవుతున్నారు. భారీ క్యూలో నిల్చుని మరీ స్టేడియంలోకి అడుగుపెట్టిన ఉద్యోగుల్లో ఉల్లాసాన్ని రేపుతూ ఉద్యోగులే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఉద్యోగిని పలువురు సినీతారలను, రాజకీయ నాయకులను అనుకరిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా చేసిన మిమిక్రీ అందరినీ అలరించింది.