: కాశ్మీర్ ను పాక్ లా చేయాలనుకుంటున్నారా: ఫరూక్ అబ్దుల్లా


ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతా సంగీత కచేరీని వ్యతిరేకిస్తున్న ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ పై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, కేంద్రమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించడానికి హురియత్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజు ఇక్కడి ప్రజలు ఒకరినొకరు చంపుకుని కాశ్మీర్ ను పాకిస్థాన్ లా చేయాలనుకుంటున్నారా? అని అబ్దుల్లా ప్రశ్నించారు. నేడు కాశ్మీర్ లో నిర్వహించనున్న జుబిన్ మెహతా సంగీత కచేరీని 104 దేశాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

  • Loading...

More Telugu News