: వ్యాట్ పై వస్త్ర వ్యాపారుల సమరం..రేపు బంద్ కు పిలుపు
బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్ కు వస్త్ర వ్యాపారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే వస్త్రాలపై వ్యాట్ తొలగించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం వస్త్రాల విక్రయంపై సెన్సిటివ్ కమాడిటీస్ చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చింది. దీంతో వస్త్ర వ్యాపారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై వ్యాట్ తో పాటు కొత్త చట్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర సంఘాలు బంద్ పాటించనున్నట్లు వస్త్ర వ్యాపారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ తెలిపారు.