: ఉత్తర కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి


ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది సునీల్ ఆర్ కులకర్ణి(41) ఉత్తర కాలిఫోర్నియాలోని శాంతా క్లారా కంట్రీ అత్యున్నత జడ్జిగా నియమితులయ్యారు. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి దక్షిణాసియా వాసిగా రికార్డు సృష్టించారు. గతంలో ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీలో న్యాయసంబంధ విభాగంలో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. కాలిఫోర్నియాలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, తన నియామకం గురించి గవర్నర్ కార్యాలయం నుంచి ఫోన్ రాగానే సంతోషానికి అవధుల్లేకుండా పోయాయన్నారు. అలాగే దక్షిణాసియా విద్యార్థులు న్యాయశాస్త్రం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News