: సభకు మమ్మల్నీ అనుమతించండి: ప్రైవేటు ఉద్యోగులు
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరయ్యేందుకు సీమాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు తరలి వస్తుండగా.. 'మేము సైతం' అంటూ ప్రైవేటు ఉద్యోగులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకుని తమను సభా ప్రాంగణంలోనికి అనుమతించాలని పోలీసులను కోరుతున్నారు. అయితే, వీరి విన్నపానికి పోలీసులు నిరాకరిస్తున్నట్టు సమాచారం. కాగా, నగరంలో ఉన్న సమైక్యవాదులు భారీగా చేరుకుంటుండడంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీ జనసందోహం కనిపిస్తోంది. సీమాంధ్ర ఉద్యోగులను వారి గుర్తింపు కార్డులను పరిశీలించిన పిమ్మటే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు.