: నాది, నరేంద్రమోడీదీ ఒకే కల: శశిథరూర్
'ప్రధానమంత్రి కావాలని నేనెప్పుడూ కల కనలేదు. 2017 వరకు గుజరాత్ కు సేవ చేయడమే నా ప్రాధాన్యం' అన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రి శశిథరూర్ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా గతంలో అలానే కల కన్నానని.. నాది, మోడీది ఒకే కల (మోడీ ప్రధాని కాడని) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇండోర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మోడీ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా థరూర్ పై విధంగా స్పందించారు.