: ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న కళా ప్రదర్శనలు
ఈ మధ్యాహ్నం హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సభకు హాజరయ్యేందుకు సీమాంధ్ర ఉద్యోగులు భారీ ఎత్తున తరలివస్తుండగా, సభా ప్రాంగణం వద్ద కళాకారులు తమ ప్రదర్శనలతో అలరిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియంలో ఆసీనులైన వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియం సగభాగం ఉద్యోగులతో నిండిపోయింది.