: మావోయిస్టుల ఆయుధాలుగా చిన్నారులు
దశాబ్దాలుగా రాజ్యంపై పోరు సలుపుతున్న మావోయిస్టులు తమ లక్ష్యం దిశగా వ్యూహాలను మార్చుకుంటున్నారు. పోలీసుల అణచివేతను తట్టుకుని తమ ఉనికిని కాపాడుకోవడంతోపాటు, కార్యకలాపాలను, ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి చిన్నారులను ఆయుధాలుగా చేసుకుంటున్నారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో 10 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న 10వేల మంది గిరిజన బాల బాలికలను నియమించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అయితే వీరిని సాయుధులుగా కాకుండా తమ రోజువారీ అవసరాలు, వంటపనులు చేసేందుకు, కొరియర్లుగానూ ఉపయోగించుకుంటున్నారు. వీరికి ఆయుధాల వినియోగంలో స్వల్ప శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. పోలీసుల కదలికలు, సమాచారాన్ని గుర్తిస్తూ మావోయిస్టులకు చేరవేసే బాధ్యతలలో వీరిని వినియోగిస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.