: విదేశీ ఇన్వెస్టర్లు అనుమతి లేకుండానే వాటా పెంచుకోవచ్చు


రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విదేశీ నిధులు రాబట్టే దిశగా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏదైనా భారతీయ కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాను పెంచుకోవాలని అనుకుంటే ఇకపై రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరం లేదు. వారు నేరుగా అదనపు వాటాను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్లకు సమయం ఆదా అవడంతోపాటు మరిన్ని పెట్టుబడులు వస్తాయని రిజర్వ్ బ్యాంకు యోచన. విదేశీ నిధులు వెనక్కి వెళుతుండడం వల్లే రూపాయి మారకం విలువ తరిగిపోతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News