: పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం
పసిఫిక్ మహాసముద్రంలో గ్వాటెమాల తీరంలో ఈ ఉదయం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్వాటెమాల పట్టణానికి పశ్చిమంగా 167 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ పజాపితకు 6 కిలోమీటర్ల సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూ భౌతిక పరిశోధనా సర్వే కేంద్రం తెలియజేసింది. పసిఫిక్ లో 67 కిలోమీటర్ల లోతులో వచ్చిన ఈ భూకంప తీవ్రతకు సమీపంలోని పట్జీసియా పట్టణంలో పలు భవనాలు నేల మట్టమయ్యాయని సమాచారం. అలాగే కొండచరియలు విరిగిపడడంతో ఒక హైవే కూడా మూసుకుపోయింది. ఈ కంపనాలు సమీపంలోని ఎల్ సాల్వడార్ ను కూడా తాకాయి. ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం తెలియరాలేదు.