: తెలంగాణలో కొనసాగుతున్న బంద్
తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపు మేరకు తెలంగాణ జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డు పైకి రాలేదు. సూర్యాపేటలో సత్తుపల్లి డిపోకి చెందిన బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఖమ్మం డిపో ఎదుట న్యూడెమోక్రసీ కార్యకర్తలు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. హన్మకొండలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నేతృత్వంలో తెరాస కార్యకర్తలు డిపో ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెరాస, రాజకీయ ఐకాస నేతలు సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.