: ఏపీఎన్జీవోల సభ నేపథ్యంలో హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభ నేపథ్యంలో నగరంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తెలిపారు.

ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. అబిడ్స్ , గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ వైపు అనుమతించరు. ఈ వాహనాలను గన్ ఫౌండ్రీ ఎస్ బీహెచ్ వైపు మళ్ళిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్ బాగ్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్ వైపు, రాజ్ మొహల్లా వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా సెమెట్రీ జంక్షన్ వైపు, కింగ్ కోఠీ, బషీర్ బాగ్ , భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చే వాటిని కింగ్ కోఠీ మీదుగా తాజ్ మహల్ హోటల్ వైపు, లిబర్టీ మీదుగా బషీర్ బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు మళ్ళిస్తారు. పోలీస్ కంట్రోల్ రూం నుంచి బషీర్ బాగ్ వైపు వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు. వీవీ విగ్రహం నుంచి తెలుగుతల్లి ప్లైఓవర్ పైకి, అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి తెలుగుతల్లి రోడ్ వైపు వాహనాలను అనుమతించరని తెలిపారు.

ఎల్బీ స్టేడియం చుట్టూ ఏర్పాటు చేసిన డైవర్షన్ పాయింట్ల వద్ద నుంచి మాత్రమే పాసులు ఉన్న వారిని సభాప్రాంగణంలోకి అనుమతిస్తారని ట్రాఫిక్ అదనపు కమిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News